ఉపగ్రహాలకు రోబోలతో రిపేరు!

2 Jan, 2018 03:31 IST|Sakshi

వాషింగ్టన్‌: అంతరిక్షంలో చక్కర్లు కొట్టే ఉపగ్రహాలకు ఇంధనాన్ని నింపడం, మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైతే శత్రుదేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేసేందుకు వీలుగా రోబో శాటిలైట్ల తయారీకి అమెరికా సిద్ధమైంది. ఇందుకోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా), అమెరికాæ రక్షణ పరిశోధనా విభాగం ‘డార్పా’ జట్టుకట్టాయి. ‘సర్వీస్‌ స్టేషన్స్‌ ఇన్‌ ఆర్బిట్స్‌’గా వ్యవహరించే వీటివల్ల కక్ష్యల్లోని ఉపగ్రహాల జీవితకాలం బాగా పెరగనుంది. ప్రస్తుతం ఉపగ్రహాల్లో తలెత్తే లోపాలు సరిచేసేందుకు చాలా ఖర్చవుతోంది. కానీ ఈ సర్వీస్‌ స్టేషన్ల ద్వారా ఖర్చు బాగా తగ్గే వీలుంది. అంతరిక్ష యుద్ధం తలెత్తితే శత్రుదేశాల ఉపగ్రహాలను నాశనం చేయగల సత్తా వీటికి ఉంటుంది.

మరిన్ని వార్తలు