చర్చి‌ పైకప్పు కూలి 160 మంది మృతి

12 Dec, 2016 14:25 IST|Sakshi
చర్చి‌ పైకప్పు కూలి 160 మంది మృతి

ఉయో(నైజీరియా): మరికొద్ది రోజుల్లో క్రీస్మస్ పండుగ జరుపుకోనుండగా నైజీరియాలోని ఓ చర్చిలో పెను విషాదం చోటు చేసుకుంది. ఉయోలోని రిగ్‌నర్స్ బైబిల్ చర్చి పైకప్పు కూలి 160 మంది మృతిచెందారు. చర్చిలో జరిగిన ఓ మతకార్యక్రమానికి  క్రైస్తవులు హాజరై ప్రార్థనలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆక్వా ఇబామ్ రాష్ట్ర గవర్నర్ ఉడోం ఇమ్మాన్యువల్ కూడా ఈ సంఘటన జరిగిన సమయంలో చర్చిలోనే ఉన్నారు.

అయితే ఇమ్మాన్యువల్కు ఎలాంటి గాయాలు కాలేదని, ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారని అధికారులు వెల్లడించారు. ఈ సంఘనపై  నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శకలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటి వరకు 60 మృతదేహాలను బయటకు తీసినట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఉడోం ఇమ్మాన్యువల్ దర్యాప్తుకు ఆదేశించారు. చర్చి ఇంకా నిర్మాణ దశలోనే ఉండగా, క్రిస్మస్ సమీపిస్తుండగా వేగంగా పైకప్పు పనులను పూర్తి చేయడంతో ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు