నైట్ షిఫ్ట్‌లో మహిళలు.. ఈ సమస్య తప్పదు!

8 Feb, 2017 09:25 IST|Sakshi
నైట్ షిఫ్ట్‌లో మహిళలు.. ఈ సమస్య తప్పదు!

న్యూయార్క్: మహిళలు ఉద్యోగం, లేదా ఏదైనా ఉపాధికోసం పని చేయడం మంచిదే.. అయితే కొన్ని విషయాలలో వారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. నైట్ షిఫ్ట్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులు, శారీరక శ్రమ ఎక్కువగా చేసే మహిళల్లో సంతానోత్పత్తిపై ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని తాజా సర్వే (స్టడీ వెనస్ డే)లో తేలింది. గతంలో పనికి, సంతానోత్పత్తికి సంబంధించి అధ్యయనాలు జరిగాయి. అయితే తొలిసారిగా షిఫ్ట్ ల వారీగా పని, ఆ పని శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉంటే.. దాని ప్రభావం పుట్టబోయే సంతానంపై ప్రభావం చూపనుందా అనే కోణంలో అమెరికా రీసెర్చర్స్ ఈ అధ్యయనం చేశారు.

మసాచుసెట్స్‌లో సంతాన సాఫల్య కేంద్రానికి వచ్చిన దాదాపు 400 మంది మహిళల(సగటు వయసు 35)పై ఈ సర్వే చేశారు. 40 శాతం మహిళలు శారీరక శ్రమ చేస్తున్నారని, 91 శాతం మహిళలు రెగ్యూలర్ ఆఫీస్ వేళల్లో జాబ్ చేస్తున్నట్లు వెల్లడైంది. శారీరక శ్రమ చేసేవారు, నైట్ షిఫ్ట్‌లో జాబ్ చేసేవారిలో అండాల ఉత్పత్తి రేటు తక్కువగా ఉంది. ప్రతి తొమ్మిది మందిలో ఐదుగురు మహిళలు సరైన ఆహార నియమాలు పాటించడం లేదని, ఇతరత్రా కారణాల వల్ల అండాల నాణ్యత తగ్గడంతో పాటు ఉత్పత్తిరేటుపై ప్రతికూల ప్రభావం ఉందని అమెరికా రీసెర్చర్స్ తెలిపారు. వీటితో పాటు స్మోకింగ్ అలవాటు ఉంటే మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని లండన్ చన్న జయసేన ఇంపీరియల్ కాలేజ్ బృందం వెల్లడించింది.

మరిన్ని వార్తలు