కుక్క ఉంది.. బెయిల్‌ ఇవ్వండి!

31 Mar, 2019 05:13 IST|Sakshi

లండన్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.13,500 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీకి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్స్‌ కోర్టు బెయిల్‌ నిరాకరించినపుడు చిత్రమైన ఘటన జరిగింది.∙ఈ సందర్భంగా నీరవ్‌ బెయిల్‌ పొందేందుకు వీలుగా ఆయన లాయర్ల బృందం కొత్తతరహా వాదనను కోర్టుముందుకు తీసుకొచ్చింది. నీరవ్‌ పెంపుడు కుక్కను కారణంగా చూపుతూ బెయిల్‌ ఇవ్వాలని కోరింది. నీరవ్‌ తరఫున క్లేర్‌ మాంట్‌గోమెరీ వాదనలు వినిపిస్తూ..‘నీరవ్‌ మోదీ కుమారుడు ఇక్కడే చార్టర్‌హౌస్‌ ప్రాంతంలో పాఠశాల చదువు పూర్తిచేశారు.

ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నారు. దీంతో ఒంటరితనంతో ఉన్న నీరవ్‌ ఓ కుక్కను తెచ్చుకుని పెంచుకుంటున్నారు దేశాన్ని వదిలిపోయే వ్యక్తులెవరైనా ఈ పని చేస్తారా? బ్రిటన్‌ ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులకు పేరుగాంచింది’ అని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌కు వచ్చాక మరో దేశపు పౌరసత్వం కోసం నీరవ్‌ దరఖాస్తు చేసుకోలేదన్నారు. ఒకవేళ బెయిల్‌ మంజూరుచేస్తే నీరవ్‌ పాస్‌పోర్టును స్వాధీనం చేయడంతో పాటు హాంకాంగ్, సింగపూర్, యూఏఈలో ఉన్న నివాస అనుమతి పత్రాలను సరెండర్‌ చేస్తారని కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం నీరవ్‌ దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎన్నికల ఫలితాలు.. అమెరికా స్పందన

అల్‌హార్తికి మాన్‌ బుకర్‌ బహుమతి

చరిత్ర సృష్టించిన భారతీయ యువతి

చిల్లర వ్యాపారం.. చేతినిండా పని!

వేడి వేడి సూపు ఆమె ముఖంపై.. వైరల్‌

16 సెకన్లు.. 16 వేల టన్నులు

నలబై ఏళ్లలో 44 మందికి జన్మనిచ్చింది

పెల్లుబుకిన ఆగ్రహం : ఆపిల్‌కు భారీ షాక్‌!

ముంచుతున్న మంచు!

అట్టుడుకుతున్న అగ్రరాజ్యం

ట్రేడ్‌ వార్ : హువావే స్పందన

భారతీయ విద్యార్థులకు ఊరట

మీడియా మేనేజర్‌ ఉద్యోగం : రూ.26 లక్షల జీతం

ఒక్క అవకాశం ఇవ్వండి: బ్రిటన్‌ ప్రధాని

ఇఫ్తార్‌ విందుతో గిన్నిస్‌ రికార్డు

ఎవరెస్ట్‌పైకి 24వ సారి..!

ఒకే కాన్పులో ఆరుగురు జననం!

డబ్బులక్కర్లేదు.. తృప్తిగా తినండి

అమెరికాలోని హిందూ దేవాలయాల్లో వరుస చోరీలు

రష్యా దాడి : సిరియాలో 10మంది మృతి

విడోడో విజయం.. దేశ వ్యాప్తంగా ఉద్రిక్తత

మాతో పెట్టుకుంటే మటాష్‌!

బ్రెజిల్‌లో కాల్పులు

ఎల్‌ఈడీ బల్బులు వాడితే ప్రమాదమే!

ఆమె ఎవర్ని పెళ్లి చేసుకుందో తెలిస్తే షాక్‌..

ఓ ‘మహర్షి’ ఔదార్యం

రేప్‌ లిస్ట్‌... స్టార్‌ మార్క్‌

బ్రెజిల్‌లో కాల్పులు.. 11 మంది మృతి

విమానం ఇంజిన్‌లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

మేం చేసిన తప్పు మీరూ చేయకండి : ఆపిల్‌ సీఈవో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

అంజలి చాలా నేర్పించింది!

ఆ లోటుని మా సినిమా భర్తీ చేస్తుంది

ఆడియన్స్‌ క్లాప్స్‌ కొడతారు

చలో చెన్నై

‘విజయగర్వం నా తలకెక్కింది’