ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలా సీతారామన్‌ హవా

13 Dec, 2019 13:15 IST|Sakshi

క్వీన్ ఎలిజబెత్ -2, ఇవాంకా ట్రంప్‌ కంటే   నిర్మలా సీతారామన్‌ ముందు

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వంలో తొలి ఆర్థిక మంత్రిగా రికార్డు దక్కించుకున్న ఆమో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారు. అంతేకాదు ఈ లిస్ట్‌లో క్వీన్ ఎలిజబెత్-2, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె,సలహాదారు ఇవాంకా ట్రంప్‌ను కూడా వెనక్కి నెట్టి ముందుకు దూసుకొచ్చారు. న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెర్న్ కంటే నిర్మలా సీతారామన్ ముందున్నారు.

'ది వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్' జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచంలో 34 వ ర్యాంకులో నిలిచారు. క్వీన్ ఎలిజబెత్-2 15  పాయింట్లు క్షీణించి 38వ స్థానం, ఇవాంకా ట్రంప్‌ 18 ర్యాంకులు పడిపోయి 42 వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర భారతీయ మహిళల్లో రోష్ని నాదర్ మల్హోత్రా, 54 వ స్థానంలో నిలవగా, కిరణ్ మజుందార్ షా 65 వ స్థానంలో ఉన్నారు. 61 వ స్థానంలో రిహానా, 66 వ స్థానంలో బెయోన్స్ నోలెస్, 71 వ స్థానంలో టేలర్ స్విఫ్ట్, 81 వ స్థానంలో సెరెనా విలియమ్స్, 90 వ స్థానంలో రీస్ విథర్స్‌ స్పూన్‌, స్వీడిష్‌బాలిక గ్రెటా థన్‌బెర్గ్ 100 వ స్థానాన్ని దక్కించుకున్నారు.

కాగా జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మార్కెల్ వరుసగా తొమ్మిదిసారి కూడా ఈ జాబితాలో నెంబర్‌ 1 స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు ప్రెసిడెంట్‌ క్రిస్టీన్ లగార్డ్ (2), నాన్సీ పెలోసి (3), యూరోపియన్ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాన్ డెర్ లేయన్ (4), జనరల్‌ మోటార్స్‌ సీఈవో  మేరీ బార్రా (5) మేరీ బార్రా (5), మెలిండా గేట్స్, అబిగైల్ జాన్సన్, అనా ప్యాట్రిసియా బోటిన్, గిన్ని రోమెట్టి, మారిలిన్ హ్యూసన్ మిగిలిన టాప్ 5 స్థానాలను దక్కించుకున్నారు.

మరిన్ని వార్తలు