'కాల్పులు కాదు.. అలాంటి పెద్ద శబ్దం మాత్రమే'

29 Aug, 2016 11:33 IST|Sakshi

 
లాస్ ఎంజెల్స్: లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి కాల్పుల ఘటనలు చోటుచేసుకోలేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఒక పెద్ద శబ్దం మాత్రమే వచ్చి దాన్ని ఎయిర్ పోర్ట్ సిబ్బంది కాల్పులుగా భ్రమపడ్డారని చెప్పారు.  అమెరికాలోని లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకున్నాయని తొలుత కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

తొలుత కాల్పుల శబ్దం విన్న సిబ్బంది ఈ సమాచారాన్ని అధికారులకు చెప్పడంతో వారు వేగంగా స్పందించారు. స్వాట్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. కీలక సాయుధ బలగాలను మోహరించాయి. విమానాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. చాలామంది ప్రయాణికులు కాల్పుల ఘటన జరిగిన నేపథ్యంలో పరుగులు పెట్టారు. మరికొందరిని ప్రయాణీకులను సురక్షితంగా సమీపంలోని రెస్టారెంట్లకు తరలించారు. అయితే, తీవ్ర స్థాయిలో గాలింపులు చేపట్టిన పోలీసులు చివరకు కాల్పులు జరగలేదని, ఉగ్రవాదులు లేరని స్పష్టం చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

>
మరిన్ని వార్తలు