పఠాన్ కోట్ దాడి దర్యాప్తుకు పాక్లో బ్రేక్

1 Feb, 2016 19:39 IST|Sakshi
పఠాన్ కోట్ దాడి దర్యాప్తుకు పాక్లో బ్రేక్

ఇస్లామాబాద్: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడికి సంబంధించిన దర్యాప్తును ఇక ముందుకు తీసుకెళ్లలేమని పాకిస్థాన్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. మరిన్ని ఆధారాలను తమకు అందించాల్సిందిగా భారత్ను కోరినట్లు సమాచారం. కీలక వర్గాల సమాచారం మేరకు పఠాన్ కోట్ పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉపయోగించిన ఐదు ఫోన్ నెంబర్లను భారత్ పాకిస్థాన్ దర్యాప్తు అధికారులకు అందించింది.

అయితే వీటిని పరిశీలించిన వారు వాటి ద్వారా ఎలాంటి సమాచారం రాబట్టలేమని చెప్పినట్లు అక్కడి పత్రిక డాన్ తెలిపింది. 'దర్యాప్తు బృందం భారత అధికారులు ఇచ్చిన ఐదు నెంబర్లను పరిశీలించింది. కానీ, ఈ నెంబర్ల ఆధారంగా ఎలాంటి సమాచారం లభించడం లేదు. ఎందుకంటే అవి ఫేక్ ఐడెంటిటీ ఉన్న ఫోన్ నెంబర్లు. వాటిద్వారా దర్యాప్తు ముందుకు వెళ్లదు. అందుకే ఆ బృందానికి మరిన్ని ఆధారాలు కావాలి. అందుకే ఈ మేరకు వాటిని త్వరగా తమకు పంపించాలని భారత్కు అధికారులు లేఖ రాశారు' అని డాన్ తెలిపింది.

మరిన్ని వార్తలు