ఆదాయ పన్ను రద్దు..

11 Apr, 2017 14:35 IST|Sakshi

దోహా: తమ పౌరులు ఇక నుంచి ఆదాయపు పన్ను కట్టనవసరం లేదని సౌదీ అరేబియా  ఆర్థిక మంత్రి సోమవారం తెలిపారు. కంపెనీలు కూడా తమ లాభాల్లో పన్నులు చెల్లించనవసరం లేదని చెప్పారు. దీంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల చేపట్టిన ఆర్థిక సంస్కరణల సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి సౌదీలో ఆయిల్‌ ధరలు పతనమవడంతో అక్కడి ప్రభుత్వం పలు ఆర్థిక సంస్కరణలు చేపట్టింది.

వాటిలో భాగంగా కంపెనీలకు వచ్చిన లాభాలపై ఇక నుంచి పన్నులు విధించరు. కొత్త రకమైన పన్నులను, ప్రైవేటీకరణలో విన్నూత్న ఆలోచనలను సౌదీ ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. ప్రభుత్వ పథకాలపై ఖర్చు చేసే మొత్తంలో కూడా భారీగా మార్పులు, చేర్పులు ఉన్నాయి.

సౌదీ ప్రధాన ఆదాయ వనరు క్రూడ్ ఆయిల్. కొద్ది సంవత్సరాలుగా ఆయిల్ పరమైన ఆదాయం ఏటా తగ్గిపోతూ వస్తుండటంతో ప్రత్యామ్నాయా ఆదాయ వనరులను సౌదీ ప్రభుత్వం అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఆయిలేతర ఆదాయ వనరులపై వచ్చే ఏడాది నుంచి 5 శాతం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ను వసూలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు