భారత విద్యార్థుల వీసాలకు న్యూజిలాండ్ నో

9 Jul, 2016 03:06 IST|Sakshi
భారత విద్యార్థుల వీసాలకు న్యూజిలాండ్ నో

మెల్‌బోర్న్ : వేలాది భారతీయ విద్యార్థుల వీసాలను న్యూజిలాండ్ తిరస్కరించింది. వీసాకు దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యధికులు చదువుల కోసం రావడంలేదని ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు భావిస్తున్నారని మీడియా తెలిపింది. అధికారిక సమాచార చట్టం ప్రకారం ఆ దేశంలోని సగానికిపైగా పాలిటెక్నిక్ కళాశాల్లో వీసా తిరస్కరణ శాతం 30 శాతానికిపైగా ఉంది. సగానికిపైగా విద్యాసంస్థలు వీసాల్ని తిరస్కరిస్తున్నాయి. వాటిల్లో వీసాల తిరస్కరణ 86 శాతముందని న్యూజిలాండ్ రేడియో పేర్కొంది. 2015 డిసెంబర్- 2016 మే మధ్య  నమోదైన సమాచారాన్ని బట్టి ఈ వివరాలల్ని తెలిపింది.

ఇటీవల భారత విద్యార్థులకు సంబంధించి 3,864 వీసాలు తిరస్కరణకు గురికాగా 3,176 వీసాలకు అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు ఓకే చెప్పారు. వీసా దరఖాస్తుదారుల్లో అత్యధికులు చదువుల కోసం వస్తున్నారనే నమ్మకంలేదని, వారి పోషణకు సరిపడా ఆర్థిక వనరులు  లేవని  చెబుతున్నారు. తిరస్కరణకు గురైన వీసాల్లో అత్యధికం తప్పుడు పత్రాలని చెప్పలేమని, అయితే ఇమ్మిగ్రేషన్ నియమనిబంధనలకు తగినవిధంగా సమాచారం వాటిల్లో ఉండడంలేదని ఆక్లాండ్ ఇంటర్నేషన్ ఎడ్యుకేషన్ గ్రూపు పేర్కొంది.

మరిన్ని వార్తలు