-

మీ కారును ‘బీరు’తో నడపండి..!!

7 Dec, 2017 16:51 IST|Sakshi

న్యూఢిల్లీ : పెట్రోల్‌ కోసం క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం భవిష్యత్‌లో ఉండబోదు. బీరు మూల వస్తువుగా సరికొత్త ఇంధనాన్ని బ్రిటన్‌ పరిశోధకులు అభివృద్ధి చేశారు. రవాణా కొరకు శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయం వెతకడం ప్రారంభించిన శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేశారు.

‘మద్యంలో ఉండే ఆల్కహాల్‌లో ఇథనాల్‌ అనే మూలకం ఉంటుంది. ఇథనాల్‌ను బ్యుటనాల్‌గా మార్చి  పెట్రోల్‌కు ప్రత్యామ్నాయం సృష్టించాలని మేం భావించాం. ఆ దిశగా పరిశోధనలు చేసి ఆల్కహాల్‌లోని ఇథనాల్‌ను బ్యుటనాల్‌గా మార్చి విజయం సాధించాం.’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ ప్రొఫెసర్‌ డంకన్‌ వాస్‌ వెల్లడించారు.

ఇథనాల్‌ ముడిపదార్థాన్ని పెట్రోల్‌గా వినియోగించడం వల్ల పెద్ద మొత్తంలో నష్టాలు కలుగుతాయని చెప్పారు. ఇథనాల్‌ స్వభావ రీత్యా తక్కువ శక్తిని కలిగివుంటుందని తెలిపారు. సులువుగా నీటిలో కలిసిపోతుందని వివరించారు. దీని వల్ల వాహనాల ఇంజన్‌లు త్వరగా పాడవుతాయని చెప్పారు. అందుకే ఇథనాల్‌ను బ్యుటనాల్‌గా మార్చినట్లు వివరించారు.

ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్‌ మొత్తం లాబోరేటరీ దశలోనే ఉందని చెప్పారు. భవిష్యత్‌లో ‘బీరు’ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని పరిశోధనలు చేసి ఇండస్ట్రీ లెవల్‌లో పెట్రోల్‌కు ప్రత్యామ్నాయాన్ని సృష్టించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు