పాక్‌-చైనా అనుబంధం సాటిలేనిది: పాక్‌ ఆర్మీ ఛీఫ్‌

1 Aug, 2017 20:01 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాక్‌ - చైనా అనుబంధంపై ఇరు దేశాలు ఆడుతున్న దాగుడు మూతలాట బయట పడింది. సాక్షాత్తు పాకిస్తాన్‌ ఆర్మీ ఛీఫ్‌ ఖమర్‌ జావీద్‌ బజ్వా తమ అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. తమ అనుబంధానికి ప్రపంచంలో సాటిలేదని పాక్‌ ఆర్మీ ఛీఫ్‌ చెప్పుకురావడం విశేషం. పాకిస్తాన్‌, ఇస్లామాబాద్‌లోని చైనా దౌత్యకార్యాలయంలో మంగళవారం జరిగిన చైనా 90వ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో జావీద్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డోక్లాం వద్ద భారత్‌- చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితు మధ్య ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

ఈసందర్భంగా పాక్‌ ఆర్మీ ఛీఫ్‌ మాట్లాడుతూ పాక్‌ చైనాల మధ్య అనుబంధానికి సమానమైనది ప్రపంచంలో ఏదీ లేదన్నారు. భారత్‌కు పక్కలో బల్లెంలా తయారైన చైనాను తన సోదర దేశంగా అభివర్ణించారు. ఈసందర్భంగా చైనా అంబాసిడర్‌గా పనిచేస్తున్న ఆసిఫ్‌ గఫూర్‌ రెండు దేశాల మధ్య పరస్పర సైనిక సహకారం, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మూల స్తంభం అని సోషల్‌ మీడియా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వీటన్నింటినీ పాకిస్తాన్‌ మీడియా ప్రముఖంగా పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు