షరీఫ్తో మోడీ భేటీ లేదు

26 Nov, 2014 14:32 IST|Sakshi
షరీఫ్తో మోడీ భేటీ లేదు

కాట్మాండ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ల మధ్య ప్రస్తుతానికి ఎలాంటి భేటీ లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ బుధవారం నేపాల్ రాజధాని కాట్మాండ్లో స్పష్టం చేశారు. ఇరు దేశాల నేతల మధ్య భేటీకి ఇప్పటి వరకు తమ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవని వెల్లడించారు. 18వ సార్క్ సమావేశాలు కాట్మాండ్లో ఈ రోజు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో భారత్, పాక్ దేశాల ప్రధానులతోపాటు మరో ఆరు దేశాధినేతలు ఈ సమావేశాలకు హాజరయ్యరు.

దీంతో భారత్, పాక్ నేతలు ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించే అవకాశం ఉందా అని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సయ్యద్ అక్బరుద్దీన్పై విధంగా స్పందించారు. ఇటీవల కాలంలో భారత్పై పాకిస్థాన్ తరచుగా కాల్పులకు తెగబడుతు గతంలో ఇరుదేశాలు మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఇరుదేశాల ప్రధానులు సార్క్ సమావేశాలలో భాగంగా భేటీ అయి చర్చించ వచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు