పొట్టి దుస్తులు వేసుకుంటే పెళ్లి ఆపేస్తారు!

4 Jun, 2016 19:36 IST|Sakshi
పొట్టి దుస్తులు వేసుకుంటే పెళ్లి ఆపేస్తారు!

బీజింగ్: వివాహాలపై ప్రజలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని చైనా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రజల్లో వివాహంపై సదాభిప్రాయం ఏర్పడేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో పెళ్లి కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ ఇష్టరీతిలో వస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. వీటికి అడ్డుకట్ట వేయడానికి డ్రెస్ కోడ్ పాటించాలంటూ కొత్తగా నియమాలు పెట్టారు.

వివాహం చేసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే దంపతులు సాంప్రదాయ దుస్తువులలోనే కనిపించాలని, లేనిపక్షంలో మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చేది లేదని తెలిపారు. బ్యూరో ఆఫ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ డైరెక్టర్ హాన్ మాంగ్జి ఈ వివరాలను వెల్లడించారు. షార్ట్, ఇతర పొట్టి దుస్తువుల్లో వధూవరులు కనిపిస్తే వారి వివాహాన్ని నిలిపివేయడంతో పాటు మ్యారేజ్ లైసెన్స్ పోస్ట్ పోన్ చేస్తామని హెచ్చరించారు. షార్ట్స్ ధరించి స్లిప్పర్స్ తో కనిపించడం కూడా తమ సాంప్రదాయంపై వధూవరులలో ఉన్న ఆసక్తిని తెలుపుతుందన్నారు.

జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని డైరెక్టర్ వెల్లడించారు. 2015లో 36 లక్షల జంటలు విడాకులు తీసుకోగా, అందులో కేవలం బీజింగ్ నగరంలో 55 వేల విడాకులు ఉన్నట్లు తెలిపారు. ఈ విషయం తెలియగానే కొందరు విడాకుల వ్యవహారంపై మండిపడ్డారు. పెళ్లంటే వారికి పిల్లలు ఆడుకునే ఆటలాగ కనిపిస్తుందా అంటూ స్థానిక సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొస్తున్నాయి. యువతలోనే ఎక్కువగా విడాకులు తీసుకునే ఆలోచన ధోరణి ఉందని, కనీసం పెళ్లిరోజు కూడా సాంప్రదాయాలను పాటించక పోవడం దురదృష్టకరమని హాన్ మాంగ్జి అన్నారు.

మరిన్ని వార్తలు