ఏంటా డెవిల్‌..?

19 Apr, 2018 10:20 IST|Sakshi
పసిఫిక్‌ మహా సముద్రంలో కనిపించిన వింత స్క్విడ్‌

మెక్సికో గల్ఫ్‌ : సముద్రలోతుల్లో పరిశోధనలు సాగిస్తున్న ఎన్‌ఓఏఏ ఒకియనోస్‌ ఎక్స్‌ప్లోరర్‌ సంస్థ పరిశోధకులకు ఒక విచిత్ర జీవి ఎదురైంది. వేల అడుగుల లోతుకి వెళ్లి అధ్యాయనం చేస్తున్న వారికి అచ్చూ డెవిల్‌ ఫిష్‌లాంటి జీవి మరొకటి కనిపించి ఆశ్చర్యపర్చింది.

మెక్సికో తీరంలో ఓ స్క్విడ్‌ ఎరుపు రంగులో డెవిల్‌ ఫిష్‌లా కనిపించడంతో పరిశోధకులు విస్తుపోయారు. దాన్ని కొందరు దెయ్యపు చేపగా పిలువగా పరిశోధకులు మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి పేరు పెట్టలేదు.

మెక్సికో పసిఫిక్‌ తీరం జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు. పగడపు దీవులు మొదలు, స్పంజికలు, ఊహలకు అందని లోతైన లోయలు, అగ్నిపర్వతాలు ఇక్కడ ఉన్నాయి.

మరిన్ని వార్తలు