27 ఏళ్ల తర్వాత ఖండించింది

25 Mar, 2016 09:10 IST|Sakshi
తాను రాసిన పుస్తకంతో సల్మాన్ రష్డీ

రష్డీపై ఫత్వాను ఖండించిన నోబెల్ కమిటీ

స్టాక్‌హోం: బ్రిటిష్ ఇండియన్ నవలా రచయిత, వివాదాస్పద సెటానిక్ వర్సెస్ పుస్తకాన్ని రాసిన సల్మాన్ రష్డీపై ఇరానియన్ మతపెద్ద అయతున్లా రుహుల్లా కొమైనీ జారీ చేసిన ఫత్వాను స్వీడిష్ అకాడమీ గురువారం ఖండించింది. నోబెల్ సాహిత్య విజేతను ఎంపిక చేసే ఈ కమిటీ నుంచి 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ నిర్ణయం వెలువడింది. సెటానిక్ వర్సెస్ పుస్తకంలో ఇస్లాంను కించపరచారనే ఆరోపణలతో రష్డీపై ఫత్వా జారీ అయింది.

అయితే 1989లో దీన్ని ఖండించడానికి అకాడమీ నిరాకరించడంతో ఇద్దరు సభ్యులు తమ పదవులనుంచి తప్పుకున్నారు. ఈ పుస్తకంపై రాజకీయ దుమారం రేగడంతో స్వీడిష్ అకాడమీ వ్యక్తికి భావప్రకటనా స్వేచ్ఛ ఉందని చెబుతూనే రష్డీకి మద్దతు మాత్రం ప్రకటించలేదు. ఏదేమైనప్పటికీ ఇన్నాళ్లకు రష్డీపై ఫత్వాను ఖండించిన స్వీడిష్ అకాడమీ ఆయన తలకు వెలకట్టడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

మరిన్ని వార్తలు