'క్వాంటమ్' పరిశోధకులకు మహా పురస్కారం

6 Oct, 2015 16:29 IST|Sakshi
'క్వాంటమ్' పరిశోధకులకు మహా పురస్కారం

అట్లాంటా: క్వాంటమ్ మెకానిక్స్ లో పరిశోధనలను మరింత ముందుకు తీసుకుపోయేలా.. న్యూట్రినోలకూ ద్రవ్యరాశి ఉంటుందని రుజువుచేసిన భౌతికశాస్త్రవేత్తలు ఇద్దరికి ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది.

జపాన్ కు చెందిన టకాకి కజితా, కెనడాకు చెందిన మెక్ డోనాల్డ్ లను సంయుక్తంగా అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ మంగళవారం ప్రకటించింది. మూలకణంలో ఎలక్ట్రాన్లను పోలి ఉండే న్యూట్రినోల పనితీరుపై ఈ ఇరువురు పరిశోధనలు చేశారు. టకాకి.. యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందినవారుకాగా, మెక్ డోనాల్డ్ కెనడాలోని సడ్బ్యూరీ న్యూట్రినో అబ్జర్వేటరీ ఇన్ స్టిట్యూట్ కు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు