స్మోక్ చేయకున్నా మహిళలకే అధిక ముప్పు!

12 Dec, 2016 14:24 IST|Sakshi
స్మోక్ చేయకున్నా మహిళలకే అధిక ముప్పు!

వాషింగ్టన్: సాధారణంగా పొగతాగేవారు(స్మోకర్స్) ఊపిరితిత్తుల కేన్సర్ భారిన పడతారని వింటూనే ఉంటాం. తాజాగా స్మోకింగ్ సంబంధిత అంశాలపై జరిపిన ఓ సర్వేలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ పై యూనివర్సిటీ ఆఫ్ టొరంటో చేపట్టిన సర్వేలో మహిళలకే అధికంగా ముప్పు పొంచి ఉంటుందని వెల్లడైంది.

స్మోకింగ్ చేయని 50-60 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషుల 129535 శాంపిల్స్ పై రీసెర్చ్ చేశారు. ఇందులో 8674 ఆఫ్రికన్ మహిళలు, 2708 ఆఫ్రికన్ పురుషుల శాంపిల్స్, 80 వేల మంది అమెరికా మహిళలు, 37 వేల మంది పరుషుల శాంపిల్స్ పై టొరంటో వర్సిటీకి చెందిన రేచల్ చిషోల్మ్ అనే వ్యక్తి పరిశోధన చేశాడు. స్మోకింగ్ చేయని ఆఫ్రికన్, అమెరికన్ మహిళల్లో 5.2 శాతం మందికి క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్(సీఓపీడీ) వస్తుండగా, స్మోక్ చేయని మగవారిలో మాత్రం 2.9 శాతం మందికి ఈ వ్యాధి వస్తుందని రీసెర్చ్ లో తేలింది.   

ఇంకా చెప్పాలంటే స్మోకింగ్ చేయని పురుషులు తమ పక్కన ఉన్న స్మోకర్స్ వల్ల సెకండ్ హ్యాండ్ స్మోకర్లుగా ఉన్నా.. వారిలో మాత్రం ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం మహిళల  కంటే చాలా తక్కువగా ఉందని రీసెర్చర్ చిషోల్మర్ వివరించారు.

మరిన్ని వార్తలు