చర్చలకు మేం సిద్ధమే!

6 Jan, 2018 03:38 IST|Sakshi

దక్షిణ కొరియాతో చర్చలపై ఉత్తరకొరియా వెల్లడి

సియోల్‌: దాదాపు రెండేళ్ల తర్వాత దక్షిణకొరియా, ఉత్తరకొరియా దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు వచ్చే వారంలో సమావేశం కానున్నారు. సరిహద్దులోని పాన్ముంజోమ్‌లో వీరు చర్చలు జరపనున్నారు. ఈ చర్చలను ‘మంచి పరిణామం’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అభివర్ణించారు. అమెరికాపై ఎక్కడైనా దాడి చేయగల అణు క్షిపణులు తన వద్ద ఉన్నాయనీ, దాడిని సంబంధించిన న్యూక్లియర్‌ బటన్‌ తన టేబుల్‌ పైనే ఉంటుందని కిమ్‌ ఇటీవల హెచ్చరించడం తెల్సిందే. దీనికి సమాధానంగా ట్రంప్‌.. కిమ్‌ దగ్గర ఉన్న దాని కంటే శక్తిమంతమైన బటన్‌ తన వద్ద ఉందని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు