ఆ సీడీ ఇవ్వనందుకు కార్లో నుంచి లాగి అరెస్టు

25 Mar, 2016 21:35 IST|Sakshi
ఆ సీడీ ఇవ్వనందుకు కార్లో నుంచి లాగి అరెస్టు

ఉత్తర కరోలినా: ఎప్పుడో అద్దెకు తీసుకున్న పాత సీడీ తిరిగి ఇవ్వలేదనే కారణంతో ఉత్తర కరోలినా పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. కారులో వెళుతున్న అతడిని బయటకు లాగి మరీ బేడీలు తగిలించారు. దీంతో అతడు బిత్తరపోయాడు. జేమ్స్ మేయర్స్ అనే వ్యక్తి 2002లో జే అండ్ జే అనే సంస్థకు చెందిన సీడీల షాపు నుంచి కామెడీ మూవీ ఫ్రెడ్డీ గాట్ ఫింగర్డ్ సీడీని తీసుకున్నాడు. కానీ, తిరిగి ఇవ్వడం మాత్రం మరిచిపోయాడు.

ఎప్పుడో 2002 కింద తీసుకున్న సీడీ ఘటనను బహుశా అతడు మరిచిపోయాడనుకుంటా. పోలీసు కారులో నుంచి లాగి అతడిని అరెస్టు చేస్తున్నామని చెప్పినా కామెడీ అనే అనుకున్నాడు. బేడీలు చూశాక మాత్రం అతడికి బోధపడింది. ఈ సందర్బంగా పోలీసు అతడితో ఏమన్నాడంటే..'నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. 2002లో నువ్వు తీసుకున్న ఓ సీడీని రిటర్న్ ఇవ్వనందుకు అరెస్టు చేస్తున్నాను' అని అన్నాడు. దీంతో ఆ పోలీసు జోక్ చేస్తున్నాడేమో అని అనుకున్నానని, కానీ జీవితంలోనే మొదటిసారి చేతికి హ్యాండ్ కప్స్ వేసుకున్నానని చెప్పాడు. కాగా, జైలు శిక్ష మాత్రం వేయని కోర్టు దాదాపు రూ.12 వేల ఫైన్ వేసి విడిచి పెట్టింది.

మరిన్ని వార్తలు