కిమ్‌.. మరో సంచలనం

26 Jul, 2019 09:02 IST|Sakshi

సియోల్‌: కొన్నాళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలను చేపట్టింది. తక్కువ దూరాలను ఛేదించే రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను ఆ దేశం గురువారం సముద్రంలోకి ప్రయోగించి కలకలం రేసింది. ఇప్పటివరకు న్యూక్లియర్‌ పరీక్షల నిలుపుదలపై అమెరికాతో ఉత్తర కొరియా జరుపుతున్న చర్చలు తాజా ప్రయోగంతో సంక్లిష్టమవ్వనున్నాయి. గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఉన్‌ల మధ్య కుదిరిన అణు నిరోధక చర్చల తర్వాత జరిగిన మొదటి క్షిపణి ప్రయోగం ఇదే. క్షిపణుల ప్రయోగాన్ని చేపట్టినట్లు దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ధ్రువీకరించారు. కొత్త రకం క్షిపణులుగా కనిపిస్తున్న వీటిలో ఒకటి 430 కిలోమీటర్ల దూరం వెళ్లగా.. రెండోది 690 కిలోమీటర్లు వెళ్లినట్లు సియోల్‌లోని అధికారి తెలిపినట్లు సమాచారం.

దక్షిణ కొరియాకు హెచ్చరికగా తాజా క్షిపణి ప్రయోగం చేపట్టినట్టు కిమ్‌ జంగ్‌ ఉన్‌ ప్రకటించారు. ఆయనే స్వయంగా ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. శాంతి మంత్రం జపిస్తూనే దక్షిణ కొరియా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కిమ్‌ మండిపడ్డారు. అత్యంత అధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటూ, అమెరికాతో కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోందన్నారు. తమ హెచ్చరికను పెడచెవిన పెడితే కొరియా నాయకులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, ఉత్తర కొరియాతో చర్చలు కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేసింది. అయితే కిమ్‌ కవ్వింపు చర్యలు మానుకోవాలని సూచించింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంపై జపాన్‌ కూడా స్పందించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

200 ఏళ్ల నాటి రావి చెట్టు రక్షణ కోసం...

ఇమ్మిగ్రేషన్‌ అలర్ట్‌: ట్రంప్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం

బెంగళూరులో చౌకగా బతికేయొచ్చట!

ఆరేళ్లకే..రూ. 55 కోట్ల భవనం కొనుగోలు!

గార్లిక్‌ ఫెస్టివల్‌లో కాల్పులు, ముగ్గురు మృతి

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ‘మోదీ’ ప్రచారం 

బోయింగ్‌కు ‘సెల్‌ఫోన్‌’ గండం

వైరల్‌: షాక్‌కు గురిచేసిన చికెన్‌ ముక్క!

ద్వీపపు దేశంలో తెలుగు వెలుగులు..!

దావూద్‌ ‘షేర్‌’ దందా

బ్రెగ్జిట్‌ బ్రిటన్‌కు గొప్ప అవకాశం: బోరిస్‌

భారత్, పాక్‌లకు అమెరికా ఆయుధాలు

‘ఇన్‌స్టాగ్రామ్‌’లో లైక్స్‌ నిషేధం!

ఎవరిదీ పాపం; ‍కన్నీరు పెట్టిస్తున్న ఫొటో!

నీటిలో తేలియాడుతున్న ‘యూఎఫ్‌ఓ’

పనే చెయ్యని మగాళ్లతో కలిసి పని చేసేదెలా?!

భారత్‌ నుంచి పాక్‌కు భారీగా దిగుమతి

అమెరికా ఎన్నికల ప్రచారంలో యోగా

గూగుల్‌కు ఊహించని షాక్‌

9మందిని విడుదల చేసిన ఇరాన్‌

అమెరికాలో మళ్లీ మరణశిక్షలు

విషమం : సాయం చేసి ప్రాణాలు నిలపండి..!

బ్రిటన్‌ హోం మంత్రిగా ప్రీతీ పటేల్‌

చైనా నేవీకి నిధులు, వనరుల మళ్లింపు

చైనా సాయంతో మేము సైతం : పాక్‌!

డల్లాస్‌లో కనువిందుగా ఆహా! ఈహీ! ఓహో!

‘వరల్డ్‌కప్‌తో తిరిగొచ్చినంత ఆనందంగా ఉంది’

వేసవి కోసం ‘ఫ్యాన్‌ జాకెట్లు’

బోరిస్‌ టాప్‌ టీంలో ముగ్గురు మనోళ్లే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదిరిపోయిన అధీరా లుక్‌..!

సూపర్‌స్టార్‌.. రియల్‌ బిజినెస్‌మేన్‌

‘బిగ్‌ బాస్‌ షోలో ఆయన చేసింది బాగోలేదు!’

‘ఇది ఏమైనా మీ ఇంటి హాలా, పెరడా’

కొత్త ఆలోచ‌న‌ల‌కు చిరునామా ‘తూనీగ’

‘బిగ్‌బాస్‌’పై హేమ సంచలన వ్యాఖ్యలు