నార్త్‌ కొరియా ఓ నరకం.. అందుకే దేశం విడిచాం..

24 Mar, 2018 20:49 IST|Sakshi
దక్షిణకొరియాలో ఆశ్రయం పొందుతున్న జాలరి కుటుంబం

సియోల్‌, దక్షిణకొరియా : సొంత దేశంలో పిల్లల చదువులు సాగవనుకున్న ఓ కుటుంబం పొరుగు దేశానికి పారిపోయింది. అయితే, ఇందుకు ఆ కుటుంబం దాటిన సవాళ్లు అన్ని ఇన్నీ కావు. ఉత్తరకొరియాలో చేపలు పట్టుకునే ఓ జాలరి తన బిడ్డలకు మంచి చదువు చెప్పించాలనుకున్నారు. పిల్లలు కూడా కంప్యూటర్‌ విద్యపై ఆసక్తిని కనబర్చుతుండటంతో ఆయన తాపత్రయం మరింతగా పెరిగింది.

సొంత దేశంలో విద్య కోసం ఉపాధ్యాయులకు లంచాలు ఇవ్వాల్సిన దీనస్థితి. వారికి లంచాలు ఇచ్చి బిడ్డలను చదివించలేనని భావించిన ఆయన కుటుంబంతో కలసి చైనా, వియత్నాం, లావోస్‌, థాయ్‌లాండ్‌ల మీదుగా దక్షిణకొరియా చేరుకున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా వారిని సాదరంగా దేశంలోకి ఆహ్వానించి తగిన వసతులు కల్పించింది.

తమ దేశంలోనే ఉండి పిల్లలకు మంచి చదువులు చెప్పించుకోండని అండగా నిలిచింది. అయితే, దక్షిణ కొరియా చేరేందుకు జాలరి కుటుంబం పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. తెలిసిన వారి ఆర్థిక సహాయంతో 70 రోజుల పాలు కష్టనష్టాలకు ఒనగూర్చి వారు దక్షిణ కొరియా చేరుకున్నారు.

మరిన్ని వార్తలు