అప్రమత్తమైన అమెరికా...

11 Aug, 2017 15:20 IST|Sakshi
ఆ క్షిపణులు 14 నిమిషాల్లోనే.....

వాషింగ్టన్‌: గువాం ప్రాంతంపై క్షిపణి దాడులతో చెలరేగుతామని ఉత్తర కొరియా చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఉత్తర కొరియా గువాం ద్వీపంపై క్షిపణులతో విరుచుకుపడితే అవి కేవలం 14 నిమిషాల్లోనే అక్కడకి చేరుకుని విధ్వంసం సృష్టిస్తాయని హోంల్యాండ్‌ భద్రతా ప్రతినిధి జెన్నా గమిండె చెప్పారు.

ఉత్తర కొరియా దాడులకు ఉపక్రమిస్తే 15 హెచ్చరిక సంకేతాలతో ప్రజలను అప్రమత్తం చేస్తామని తెలిపారు. గువాంలోని అన్ని ప్రాంతాల్లో హెచ్చరిక వ్యవస్థలున్నాయని తెలిపారు. కాగా ఏడువేలకు పైగా అమెరికన్‌ సైనికులు మోహరించిన గువాం ద్వీపంపై క్షిపణి దాడులకు పూర్తి ప్రణాళికతో సంసిద్ధంగా ఉన్నట్టు గురువారం ఉత్తర కొరియా ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు