ఉ. కొరియాలో అంతే!

11 Jan, 2020 03:22 IST|Sakshi
కిమ్‌ ఇల్‌ సంగ్, కిమ్‌ జోంగ్‌ ఇల్‌

హామ్‌గ్యాంగ్‌: ఉత్తరకొరియాలోని ఓ మహిళకు వింత ఘటన ఎదురైంది. దేశాధినేతల ఫొటోలను మంటల నుంచి రక్షించలేకపోయినందుకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే హ్యామ్‌గ్యాంగ్‌ ప్రావిన్స్‌లోని ఒన్సోంగ్‌ కౌంటీలో ఓ ఇంటికి నిప్పంటుకుంది. అందులో ఉన్న ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను ప్రాణాలకు తెగించి కాపాడుకుంది. అయితే ఈ క్రమంలో దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కుటుంబ సభ్యుల ఫొటోలను మంటల నుంచి కాపాడలేకపోయింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువైతే  15 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. ఉత్తర కొరియా చట్టాల ప్రకారం ప్రతి ఇంట్లో కిమ్‌ పూర్వీకులైన కిమ్‌ ఇల్‌ సంగ్, కిమ్‌ జోంగ్‌ ఇల్‌ ఫొటోలను తప్పక ఉంచుకోవాలి. ఫొటోలను సరిగా చూసుకుంటున్నారో లేదో తెలుసుకోవడానికి అప్పుడప్పుడూ అధికారులు ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తారు మరి. అదీ కిమ్‌ రాజ్యంలోని ప్రజల తిప్పలు. 

మరిన్ని వార్తలు