మా దేశానికి రండి.. మూన్‌కు కిమ్‌ ఆహ్వానం

11 Feb, 2018 03:35 IST|Sakshi
దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌

గ్యాంగ్నెయుంగ్‌: దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆహ్వానించారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జరగబోయే సదస్సుకు హాజరు కావాలని మూన్‌ను కోరారు. ఉత్తర కొరియా విదేశాంగ మంత్రితో కలసి కిమ్‌ సోదరి యో జోంగ్‌ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా కిమ్‌ పంపిన ఆహ్వాన లేఖను మూన్‌కు అందించారు. సదస్సుకు వెళ్తారా లేదా అనే దానిపై మూన్‌  స్పందించలేదు. అయితే గతేడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కిమ్‌లు వ్యక్తిగత దూషణలకు సైతం దిగడం తెల్సిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు మిత్రదేశమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు ఉ.కొరియాకు వెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వెళితే మూన్‌ ట్రంప్‌ ఆగ్రహానికి గురికావాల్సి రావొచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్షయను రూపుమాపే కొత్త మందు

ఖషోగ్గీ మృతిపై తెర వెనుక..!

2019ఎన్నికల తర్వాత భారత్‌తో చర్చలు : పాక్‌ ప్రధాని

‘ట్రంప్‌ చెప్పాడు.. ఏం కాదని’

ఖషోగి శరీర భాగాలు గుర్తింపు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో రే డార్లింగ్‌

అర్ధసెంచరీ కొట్టిన ఆలియా

అమ్మ అవుతారా?

అక్కడ కూడా హీరో రావాల్సిందేనా?

ఆ ఇద్దరంటే ఇష్టం

అప్పుడు సింగపూర్‌... ఇప్పుడు రోమ్‌