విషమం‍గా కిమ్‌ జోంగ్ ఆరోగ్యం..!

21 Apr, 2020 09:27 IST|Sakshi

ప్యాంగ్‌యాంగ్‌ : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ ఆరోగ్య తీవ్రంగా విషమించినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి సమయంలో ఆయన తీవ్ర అస్వస్థత గురైనట్లు సమాచారం. ప్రస్తుతం కిమ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్‌ హాజరుకాని విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర చర్చసాగింది. ఈ క్రమంలోనే కిమ్‌ కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స కూడా నిర్వహించారు. దాని తరువాత కిమ్‌ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. (సుప్రీం లీడర్‌ కిమ్‌కు ఏమైంది?)

మరోవైపు కాగా గడిచిన నెల రోజులుగా కిమ్ జంగ్ ఉన్ ఎందుకు సైలెంటయ్యారనే విషయమై ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిత్యం తాను చేసే పనులతో వార్తల్లో నిలిచే కిమ్ జంగ్ ఉన్ ఎందుకు కనిపించడం లేదనే చర్చ ప్రపంచ వ్యాప్తంగా సాగుతోంది. అంతేకాదు అణుపరీక్షలు, క్షిపణి పరీక్షలు కానీ నిర్వహించన దాఖలాలు లేవు. అయితే అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఉత్తర కొరియా నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

మరిన్ని వార్తలు