ఫేస్ బుక్ లో ఆకట్టుకుంటున్న శునకం

23 Apr, 2016 20:30 IST|Sakshi
ఫేస్ బుక్ లో ఆకట్టుకుంటున్న శునకం

యజమానిపై అమితమైన ప్రేమను చూపించే పెంపుడు జంతువుల్లో శునకాలదే మొదటిస్థానం అని చెప్పొచ్చు. విశ్వాసానికి మారుపేరుగా కూడ కుక్కలనే చెప్తారు. అంటువంటి ఓ పెంపుడు శునకం తన యజమానిపై అభిమానాన్ని చాటుకుంటోంది. తన యజమాని కుటుంబ సభ్యులపై ఈగవాలనివ్వకుండా చేస్తోంది. కుటుంబంలో చిన్నకొడుకుపై ప్రత్యేక  ప్రేమను చూపిస్తూ.. ఇప్పుడు.. మిలియన్లకొద్దీ  ఫేస్ బుక్ వ్యూయర్లను అమితంగా ఆకట్టుకుంటోంది.

విశ్వాసానికి నిదర్శనంగా చెప్పే శునకాలు యజమానిపై ఉండే ప్రేమను ఎన్నోసార్లు నిరూపించుకుంటుంటాయి. ఒక్క చిన్న బిస్కెట్ ముక్క పెడితే చాలు కనీసం వీధికుక్కలు కూడ వారిని మరచిపోకుండా గుర్తుపెట్టుకొని, కనిపించినప్పుడల్లా అభిమానాన్ని అనేక విధాలుగా వ్యక్తపరుస్తుంటాయి.

అటుంటి ప్రేమకు మారుపేరైన ఓ శునకం.. తన యజమానిపై చూపిస్తున్న అభిమానం  ఇప్పుడు ఫేస్ బుక్ లో ప్రత్యేకాకర్షణగా నిలిచింది.  మంచంపై పడుకున్న యజమాని చిన్నకొడుకును ఎవరు ముట్టుకున్నా తన ప్రతాపం చూపిస్తూ..మిలియన్లకొద్దీ  వినియోగదారులను ఆకర్షిస్తోంది. శుక్రవారం పోస్టు చేసిన వీడియో ఒక్క రోజులోనే సుమారు రెండున్నర కోట్ల వ్యూ లతో ప్రత్యేకతను సంతరించుకుంది.