ఫోన్ కాదు.. స్మార్ట్ ‘గన్’

27 Mar, 2016 08:10 IST|Sakshi
ఫోన్ కాదు.. స్మార్ట్ ‘గన్’

ఇదేదో కొత్త ‘స్మార్ట్’ ఫోన్‌లా ఉందని అనుకుంటున్నారా? చూడటానికి ఇది అచ్చు స్మార్ట్‌ఫోన్‌లాగే ఉంటుంది... కానీ నిజానికి ఇదో డబుల్ బ్యారెల్ .380 క్యాలిబర్ పిస్టల్. అమెరికాకు చెందిన ఐడియల్ కన్సీల్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. అచ్చు ఫోన్‌లా కనపడుతుంది. డమ్మీ కెమెరా, హెడ్‌ఫోన్ పోర్ట్ కూడా దీంట్లో పొందుపర్చారు. దాంతో దీన్ని చూసిన వారెవరూ గన్ అనుకోరు.

భద్రతా వలయాలను దాటుకొని కూడా తీసుకెళ్లడానికి ఆస్కారం ఉంటుందని... ప్రజా భద్రతకు ఇది తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే తుపాకీ సంస్కృతి బాగా పెరిగిపోయి తరచూ కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఇలాంటి గన్ తీవ్రవాదుల చేతుల్లోకి వెళితే తీవ్ర ముప్పని గన్ కల్చర్ వ్యతిరేకులు పేర్కొంటున్నారు. అయితే దీన్ని తయారు చేసిన సంస్థ మాత్రం 2016 జూలైకల్లా మార్కెట్లోకి తీసుకొస్తామని చెబుతోంది. దీని ధరను కూడా 395 డాలర్లు (దాదాపు 26,000 రూపాయలు)గా ప్రకటించేసింది.

మరిన్ని వార్తలు