లేటెస్ట్‌ ‘డెడ్‌’లైన్‌ నవంబర్‌ 19

29 Oct, 2017 13:49 IST|Sakshi

 సాక్షి,న్యూఢిల్లీ: భూమి అంతమవుతుందని కౌంట్‌డౌన్‌లతో బెంబెలెత్తించే కాన్స్పిరెసీ థీరియస్ట్‌లు ఈసారి మహా విపత్తుకు ముహుర్తం నవంబర్‌ 19 అంటూ బాంబు పేల్చారు. ఆ రోజుతో భూమి అంతమవుతుందని లెక్కలు కట్టారు. గతంలో డేవ్‌ మీడ్‌ సెప్టెంబర్‌ 23న భూమి అంతమవుతుందని జోస్యం చెప్పాడు. బైబిల్‌ ప్రకారం చూసినా, న్యూమరాజికల్‌గా చెప్పుకున్నా సెప్టెంబర్‌ 23న మహా విధ్వంసం తప్పదని అప్పట్లో వాషింగ్టన్‌ పోస్ట్‌కు చెప్పారు. ఈ జోస్యం పె‍ద్దఎత్తున ప్రచారమైంది. అయితే సెప్టెంబర్‌ 23న ఎలాంటి సునామీ చోటుచేసుకోలేదు.

ఇక ఏడు సంవత్సరాల వరుస ప్రకృతి విపత్తుల తర్వాత అక్టోబర్‌ 15న ప్రపంచ వినాశనం తప్పదని డేవ్‌ మీడ్‌ తదుపరి డెడ్‌లైన్‌ ఇచ్చాడు.అయితే ఆ రోజు అతిమామూలుగా గడిచిపోయింది. నిబిరు సిద్ధాంతం ఆధారంగా తాము లెక్కగట్టిన తేదీలు తప్పిపోయినా మరోసారి అలాంటిదేమీ ఉండదని నవంబర్‌ 19న మహా విధ్వంసం తప్పదని, భూమి అంతం​ తథ్యమని తాజా డెడ్‌లైన్‌ ప్రకటించేశారు.

నవంబర్‌ 19న ‘నిబిరు’గప్పిన నిప్పులా భారీ భూకంపాలు ప్రపంచాన్ని అంతం చేస్తాయని వాషింగ్టన్‌ పోస్ట్‌లో డేవ్‌ మీడ్‌ చెప్పారు. గత కొద్దినెలలుగా ప్రపంచంలో చోటుచేసుకుంటున్న భూ ప్రకంపనలు ఈ మహా ప్రకంపనలకు సంకేతాలుగా కాన్స్పిరెసీ థీరియస్టులు చెబుతున్నట్టు పలు వెబ్‌సైట్‌లు కథనాలతో హోరెత్తిస్తున్నాయి.

సెస్మిక్‌ కార్యకలాపాలు పెచ్చుమీరి బ్లాక్‌స్టార్‌ (నిబిరుకు మరోపేరు) చక్రాలు సోలార్‌ వ్యవస్థలో చురుకుగా కదులుతూ గ్రహాలను తారుమారు చేస్తాయని మరో రచయిత టెరాల్‌ క్రాఫ్ట్‌ రాబోయే ప్రళయాన్ని విశ్లేషించారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా