గ్లౌస్‌ ధరించినా వైరస్‌ వ్యాపిస్తుంది!

7 Apr, 2020 12:34 IST|Sakshi

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 13 లక్షలు దాటగా,  మృతుల సంఖ్య 74వేలకు చేరింది. ఇప్పటివరకు 2,78,330 లక్షల మంది బాధితులు ఈ ప్రాణాంతకమైన వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఈ వైరస్‌ను నివారించడానికి పలు దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. స్వీయ నియంత్రణ, వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ప్రభుత్వాలు పలు సూచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిచిగాన్‌కు చెందిన ఓ నర్స్‌ చేతులకు గ్లౌస్‌ తొడుకున్నపటికీ ఈ వైరస్‌ ఎలా వ్యాపిస్తుందో తన పేయింటింగ్‌ వీడియో ద్వారా వివరించారు. (ఆ దేశాలకు ఎగుమతి చేస్తాం: భారత్‌)

నర్స్‌ మోలీ లిక్సే మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి ప్రజలు చేతులకు గ్లౌస్‌ వాడుతున్నారు. ఈ సమయంలో ప్రజలు గ్లౌస్‌ వాడటం సంతోషం. వైరస్‌ నివారణకు గ్లౌస్‌ సరిపోవు. వాటి వల్ల కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుంద’ని తెలిపారు. గ్లౌస్‌ ధరించినప్పటికీ ఇంట్లో చేసే పనుల వల్ల తెలియకుండానే వైరస్‌ గ్లౌస్‌కు వ్యాపిస్తుంది. అలాగే ఇతర వస్తువులు, మొబైల్‌ ఫోన్‌ వంటి వాటిని తాకినప్పుడు వాటిపైకి వైరస్‌ చేరుతుంది. రక్షణ కలిగించే గ్లౌస్‌ తొలగించి.. వైరస్‌ ఉన్న వస్తువులను, ఫోన్‌ను ఉపయోగించటం మూలన వైరస్‌ సోకుతుంది. దీనిని క్రాస్‌ కంటామినేషన్‌ (ఒక చోటు నుంచి మరో చోటుకి మన చర్యల వల్ల వైరస్‌ వ్యాపించటం) అంటామని ఆమె తెలిపారు. (ప్రతీకారం తప్పదు.. ఇలాంటి వాళ్లను చూడలేదు)

నిత్యావసర వస్తువులను కోనుగోలు చేయడానికి సూపర్‌ మార్కెట్లకు వెళ్లే వినియోగదారుల నుంచి ఆ వైరస్‌ వస్తువులపైకి ఎలా చేరుతుంది. మరో వినియోగదారుడు ఆ వస్తువులను తాకటం వల్ల ఎలా వైరస్‌ వ్యాపిస్తుందో స్పష్టంగా మోలీ లిక్సే తన వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని, గ్లౌస్‌ను ఒకేసారి ఉపయోగించాలని మోలీ లిక్సే సూచించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు