శాంతి కోసం పాటుపడాలి

27 May, 2016 01:42 IST|Sakshi
శాంతి కోసం పాటుపడాలి

జీ7 సదస్సులో ఒబామా
ఐసే-షిమా(జపాన్): యుద్ధతంత్రాల వల్ల కలిగే నష్టాలను తెలియజెబుతూ శాంతి స్థాపనకు కృషి చేయాల్సిన అవసరాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నొక్కిచెప్పారు. జపాన్‌లో జరుగుతున్న రెండు రోజుల జీ7 శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. అణుబాంబు దాడికి బూడిదైన హిరోషిమాను శుక్రవారం ఆయన సందర్శించనున్నారు. 1945 ఆగస్టు 6న హిరోషిమాపై అణుబాంబు దాడి తరువాత అక్కడికి వెళుతున్న తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామానే. ఈ చారిత్రక పర్యటన నేపథ్యంలో ఒబామా విలేకరులతో మాట్లాడారు.

‘నాటి యుద్ధం నేటి మనసుల్లో ఉండకపోవచ్చు... కానీ అణుబాంబు ఛాయలు ఇంకా వెనక్కి లాగుతూనే ఉంటాయి’ అని ఒబామా అన్నారు. హిరోషిమాలో అణుబాంబు దెబ్బకు 1.4 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కొందరు రేడియేషన్ సంబంధిత గాయాలతో నేటికీ కోలుకోలేకపోతున్నారు. నాడు మరుభూమిగా మారిన హిరోషిమాలోని స్మృతి చిహ్నం వద్ద ఒబామా శుక్రవారం పుష్పాంజలి ఘటిస్తారు.

మరిన్ని వార్తలు