'లెజెండరీ సింగర్ మృతి.. ఒబామా కంటతడి'

22 Apr, 2016 08:43 IST|Sakshi
'లెజెండరీ సింగర్ మృతి.. ఒబామా కంటతడి'

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా కంటతడి పెట్టారు. అమెరికా లెజెండరీ ప్రముఖ పాప్ సింగర్, క్రియేటివ్ ఐకాన్ ప్రిన్స్ రోజర్స్ నెల్సన్ అకాల మరణం ఆయన కంటతడిపెట్టేలా చేసింది. ప్రస్తుతం సౌదీ అరేబియా, బ్రిటన్, జర్మనీ దేశాల్లో ఆరు రోజుల పర్యటనలో ఉన్న ఆయన ప్రిన్స్ మరణంపట్ల సంతాపం వ్యక్తం చేశారు.

అమెరికాలోని మిన్నే పోలిస్ లో గల తన స్వగృహంలో ప్రిన్స్ అనూహ్యంగా మృతిచెందాడు. దీంతో ఆ దేశం ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 'ప్రిన్స్ మృతిపట్ల మిషెల్లీ నేను.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది ఫ్యాన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. కొంత మంది ఆర్టిస్టులు వారి టాలెంట్ తో కట్టిపడేస్తారు. హృదయాలకు దగ్గరవుతారు. వారిలో ప్రిన్స్ అగ్రజుడు' అని ఒబామా చెప్పారు. ఓ మ్యూజిషియన్ గా ఎంత చేయాలాలో ప్రిన్స్ అంత చేశాడని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని చెప్పారు.

మరిన్ని వార్తలు