'నా దేశ ప్రజలారా.. భయపడకండి'

20 Sep, 2016 12:25 IST|Sakshi
'నా దేశ ప్రజలారా.. భయపడకండి'

న్యూయార్క్: తమ దేశ పౌరులకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ధైర్యం నూరి పోశాడు. ఈ వారాంతంలో జరిగిన దాడులు చూసి అమెరికన్లు ఎవరూ భయపడవొద్దని ధైర్యం చెప్పారు. అలా చేస్తే అమెరికా పౌరులను బలహీన పరచాలనుకున్న సంఘ వ్యతిరేక శక్తుల, ఉగ్రవాదులు దుష్ట లక్ష్యం నెరవేర్చినట్లు అవుతుందని చెప్పారు. గడివారం రోజుల్లో న్యూయార్క్, న్యూ జెర్సీలో పేలుళ్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రజలంతా భయాందోళలనకు లోనయ్యారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన ఆయన అక్కడే ఓ హోటల్ లో మీడియా సమావేశం పెట్టారు. 'ముఖ్యంగా ఇలాంటి సందర్బాల్లో అమెరికా పౌరులకు నేనొకటి చెప్పదలుచుకున్నాను. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా. ఉగ్రవాదులు, చొరబాటుదారులు చేసే ప్రతి పనిని ప్రజలంతా చాలా జాగ్రత్తగా గమనించాలి. వారంతా అమాయకులైన ప్రజలను చంపేస్తున్నారు. అదే సమయంలో మనందరిలో భయాన్ని పురికొల్పాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలోనే ఏ ఒక్కరం భయం గుప్పిట్లోకి జారుకోకుండా అత్యుత్తమ పౌరుడి పాత్రను పోషించాల్సి ఉంది. ఉగ్రవాదులు ఎప్పటికీ వారి లక్ష్యాన్ని చేరుకోలేరు' అని ఒబామా చెప్పారు.

>
మరిన్ని వార్తలు