ఒబామా, మిషెల్లీ పెద్ద మనసు

4 May, 2017 12:51 IST|Sakshi
ఒబామా, మిషెల్లీ పెద్ద మనసు
న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆయన సతీమణి మిషెల్లీ ఒబామా పెద్ద మనసు చాటుకున్నారు. చికాగోలోని దక్షిణ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలను కల్పించే సేవా కేంద్రాన్ని ప్రారంభించేందుకు రెండు మిలియన్‌ డాలర్లను విరాళంగా ప్రకటించారు. చికాగోలోని జాక్సన్‌ పార్క్‌లో దీనిని ఏర్పాటుచేయనున్నారు. ఇందులోనే 200 నుంచి 300 ఉద్యోగాలు ఏర్పడనుండగా దీని ద్వారా దాదాపు రెండు వేల ఉద్యోగాలు క్రియేట్‌ చేయనున్నారు.

వాస్తవానికి చికాగోలో ఇలాంటి కమ్యూనిటీ సెంటర్‌ను ఒకటి ఏర్పాటు అవడానికి ఇంకా నాలుగేళ్లు పట్టనుందని అందరూ భావిస్తుండగా అప్పటి వరకు తాము ఉండలేమంటూ స్వయంగా ఒబామా దంపతులు ముందుకొచ్చి ఈ విరాళం ప్రకటించారు. ‘మిషెల్లీ నేను వ్యక్తిగతంగా రెండు మిలిన్‌ డాలర్లను సమ్మర్‌ జాబ్స్‌ ప్రోగ్రామ్‌ కోసం విరాళంగా ప్రకటిస్తున్నాం. పని కోరేవారికి ఇది సరైన మార్గం.. దీని ద్వారా వారికి సదావకాశాలు అందించవచ్చు. మనందరం కలిసి పనేచేసేందుకు మరో నాలుగేళ్లపాటు మేం వేచి చూడలేం. అందుకే నేను, మిషెల్లీ ఇప్పుడే దానిని ప్రారంభించాలని అనుకుంటున్నాం’ అని ఆయన చెప్పారు.
>
మరిన్ని వార్తలు