వైట్‌హౌస్‌ ఖాళీ చేస్తున్న ఒబామా

17 Jan, 2017 17:10 IST|Sakshi
వైట్‌హౌస్‌ ఖాళీ చేస్తున్న ఒబామా

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవి ముగిసిన వేళ బరాక్‌ ఒబామా కొత్త ఇంట్లో అడుగుపెడుతున్నారు. అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌదం నుంచి పెద్ద మొత్తంలో వ్యాన్లలో ఆయన కుటుంబానికి సంబంధించిన కొన్ని సామాన్లను ముందస్తుగా తరలిస్తున్నట్లు మీడియా వర్గాల సమాచారం. ఎనిమిది పడకగదుల నివాసంలోకి ఒబామా మారబోతున్నారట.

 

ఆయన వస్తువులు తీసుకెళుతున్న వాహనాలను కలోరమ అనే ప్రాంతంలోని నివాసం సమీపంలో మీడియా ప్రతినిధులు ఫొటోలు కూడా తీశారు. ఈ ఇల్లు మొత్తం 8,200 చదరపు అడుగులు ఉండటమే కాకుండా ఇందులో తొమ్మిది బాత్‌ రూములు ఉన్నాయని సమాచారం. చివరిసారిగా ఆయన మీడియాకు 60 నిమిషాలపాటు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్వేతసౌదాన్ని తన కుటుంబం సంతోషంగానే విడిచిపెడుతుందని చెప్పారు. కొత్తగా మారబోతున్న ఆ ఇంటి విలువ దాదాపు.6.3 మిలియన్‌ డాలర్లు ఉంటుంది.
(చదవండి.. ఐదు గంటల్లో వైట్ హౌస్ ఖాళీ)

మరిన్ని వార్తలు