ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాలట!

10 Mar, 2016 18:34 IST|Sakshi
ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాలట!

న్యూయార్క్: స్థూలకాయులైన పిల్లలు రోడ్డు దాటేటప్పుడు వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని శాస్తవేత్తలు సూచిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో తేలిందేమిటంటే సాధారణ పిల్లలతో పోలిస్తే స్థూలకాయులైన చిన్నారులు రోడ్డు దాటేటప్పుడు సరైన సమయం వరకు వేచి చూడలేరు.
 
 ఈ క్రమంలో ప్రమాదాల బారిన పడే అవకాశముంది. ట్రాఫిక్‌లో ఆగినప్పుడు వారి మోకాలి కీళ్లపై భారం పడడంతో త్వరగా రోడ్డు దాటాలని ప్రయత్నిస్తున్నారని శాస్త్రవేత్తలు వివరించారు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్, అమెరికాలోని అలబామాలో 206 మంది చిన్నారులపై జరిపిన పరిశోధన ద్వారా ఈ నిర్ధారణకు వచ్చారు. అలాగే, స్థూలకాయులైన చిన్నారులు మల్టిటాస్కింగ్‌తో చేయాల్సిన పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూడా పరిశోధనలో వెల్లడైంది.

మరిన్ని వార్తలు