చేపలు తింటే గర్భిణులకు మేలు

8 Apr, 2016 03:32 IST|Sakshi
చేపలు తింటే గర్భిణులకు మేలు

లండన్: గర్భిణులు చేపలను తింటే పుట్టే బిడ్డలకు ఉబ్బసం దరిచేరకుండా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. లండన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన ఫిలిప్ కాడర్ నేతృత్వంలో పరిశోధనలు జరిగాయి. కొంతమంది స్త్రీలకు వారానికి రెండు సార్లు చేపలను ఆహారంగా 19 వారాలపాటు ఇచ్చారు. మిగతా వారి పిల్లలతో పోలిస్తే చేపలను ఆహారంగా తీసుకున్న తల్లుల పిల్లలకు రెండేళ్ల వయస్సు తరువాత అలర్జీ తక్కువగా ఉందని పరిశోధకులు చెప్పారు. ప్రతికూల వాతావరణం లోనూ వ్యాధులు తక్కువగా వచ్చాయన్నారు.

>
మరిన్ని వార్తలు