ఈ నాణెం విలువ రూ. 9.5 కోట్లు

20 Aug, 2019 21:52 IST|Sakshi

షికాగో : అమెరికాలోని షికాగోలో ఓ వస్తువు వేలం పాట జరుగుతోంది.. అందరూ ఆ వస్తువును దక్కించుకోవాలని తాపత్రయపడుతున్నారు. అందులో యుటా రాష్ట్రానికి చెందిన ఒక పెద్దాయన అందరి కన్నా ఎక్కువ.. దాదాపు రూ.9.5 కోట్లు వేలం పాట పాడి ఆ వస్తువును దక్కించుకున్నాడు. అమ్మో అంత మొత్తంతో దక్కించుకున్న ఆ వస్తువు ఏమై ఉంటుందనే కదా మీ ఉత్కంఠ.. అది పది పైసల బిళ్ల. ఏంటీ.. పది పైసల బిళ్లను అన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నాడా.. అతడికేమైనా పిచ్చి పట్టిందా.. అని తిట్టుకోకండి. ఎందుకంటే ఆ పదిపైసల బిళ్ల చాలా విలువైంది. ఆ బిళ్లను డైమ్‌ అంటారు. ఒక్క డాలరులో పదో వంతు దీని విలువ ఉంటుంది. అంటే రూపాయిలో పదో వంతన్నమాట. అయితే ఈ డైమ్‌ నాణేన్ని 1894లో ముద్రించారు. ఇప్పటివరకు ఇలాంటి నాణేలను 24 మాత్రమే ముద్రించారు.  

మరిన్ని వార్తలు