14న ఆకాశంలో అద్భుతం!

7 Nov, 2016 11:34 IST|Sakshi
14న ఆకాశంలో అద్భుతం!

ఇప్పుడు చూడకపోతే మళ్లీ 2034లోనే...

 విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఈ నెల 14న ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. ఆరోజున గత 70 ఏళ్లలో ఎప్పుడూ లేనంత దగ్గరగా భూమి వైపునకు చంద్రుడు రానున్నాడు. 14 శాతం పెద్దదిగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది చందమామ. సాయంత్రం 5.45 గంటల నుంచి రెండు గంటల పాటు ఈ అద్భుతం ఆకాశంలో ఆవిష్కృతమవుతుంది.

అదేరోజున కార్తీక పౌర్ణమి కూడా కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు తప్పితే మళ్లీ 2034 వరకు చంద్రుడిని ఇలా చూసే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు