కొలరాడోలో కాల్పులు.. కత్తిపోట్లు

31 Jan, 2016 08:09 IST|Sakshi
కొలరాడోలో కాల్పులు.. కత్తిపోట్లు

లాస్ ఎంజెల్స్: కొలరాడోలో కాల్పులు, కత్తిపోట్ల సంఘటన చోటుచేసుకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పలువురు గాయాలపాలయ్యారు. పశ్చిమ అమెరికాలోని భారీ ఎత్తున మోటర్ సైకిల్ షో నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

భారీ సంఖ్యలో షోకు జనాలి తరలిరావడం, అదే సమయంలో ఈ ఘటన జరగడంతో తొక్కిసలాట కూడా సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు మాత్రం బైక్ పై వస్తూ తరుచుగా దాడులకు పాల్పడినవారే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు