బ్రిటన్‌లో ముందుంది విలయం!

15 Jul, 2020 03:58 IST|Sakshi
లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వీధిలో జన సంచారం

లండన్‌: రానున్న శీతాకాలంలో కోవిడ్‌–19 కారణంగా బ్రిటన్‌లో కనీసం లక్షా ఇరవై వేల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. చలి కారణంగా ప్రజలు ఎక్కువగా ఇళ్లు, భవనాల్లో ఎక్కువ సమయం గడిపే అవకాశమున్నందున చలికాలంలో వైరస్‌ మరోసారి వ్యాప్తి చెందే అవకాశముందని పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చునని అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఏఎంఎస్‌) స్పష్టం చేసింది. కేవలం 9 నెలల కాలంలో లక్షకుపైగా మరణాలు నమోదవుతాయని తెలిపింది.

బ్రిటన్‌లో కోవిడ్‌–19 మహమ్మారి ఏ రూపం సంతరించుకుంటుందన్న విషయంపై ప్రస్తుతం చాలా అస్పష్టత ఉందని, ఒకరి నుంచి ఎంతమందికి వ్యాధి సోకుతుందన్న విషయాన్ని సూచించే ఆర్‌–నాట్‌ ప్రస్తుతమున్న 0.9 నుంచి సెప్టెంబర్‌కల్లా 1.7కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు ఏఎంఎస్‌  తెలిపింది. ఏఎంఎస్‌ నిర్వహించిన మోడలింగ్‌ ప్రకారం సెప్టెంబర్‌ 2020 నుంచి జూన్‌ 2021 మధ్యకాలంలో కోవిడ్‌ కారణంగా ఆసుపత్రుల్లోనే 1,19,000 మంది ప్రాణాలు కోల్పోనున్నారు. ఇది తొలిసారి వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్యకు రెట్టింపు కంటే ఎక్కువ.

మరిన్ని వార్తలు