టైటానిక్ ఢీకొన్న పర్వతానికి లక్ష ఏళ్లు

9 Mar, 2016 04:09 IST|Sakshi
టైటానిక్ ఢీకొన్న పర్వతానికి లక్ష ఏళ్లు

లండన్: అట్లాంటిక్ మహాసముద్రంలో 1912, ఏప్రిల్ 14న టైటానిక్ ఓడ మునిగిపోవడానికి కారణమైన మంచు పర్వతం (ఐస్‌బర్గ్) లక్ష ఏళ్ల నాటి దని శాస్త్రవేత్తలు తేల్చారు. బ్రిటన్‌లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రాంట్ బిగ్ అనే శాస్త్రవేత్త తన సమష్టి అధ్యయనంలో ఈ విషయాన్ని కనుగొన్నారు. 1912 నుంచి వాతావరణ శాఖ జరిపిన అధ్యయనాల్లోని సమాచారాన్ని తన పరిశోధనకు తీసుకున్నారు.

మహాసముద్రాల ప్రవాహాలు, గాలి అనే అంశంపై జరిపిన అధ్యయనంతో లభించిన ఆధునిక సమాచారాన్ని గత సమాచారంతో కలపి విశ్లేషించిన గ్రాం ట్ బిగ్ ‘టైటానిక్’ ఓడ ఢీకొన్న పర్వతం వయసును నిర్ధారించారు. మంచుపర్వతం వయసును లెక్కకట్టగలిగిన ఓ మోడల్ కంప్యూటర్ ను బిగ్ ఉపయోగించినట్లు సండేటైమ్స్ పత్రిక వెల్లడించింది. ఈ మంచు పర్వతం 400 అడుగుల పొడవు, సముద్ర ఉపరితలంపై 100 అడుగులకు పైగా ఎత్తు, 1.5 మిలియన్ టన్నుల బరువు ఉన్నట్లు మంచు పర్వతం పరిమాణాన్ని మొదట అంచనా వేశారు. కానీ, బిగ్ అధ్యయనం ప్రకారం 1700 అడుగుల పొడవు, 75 మిలియన్ టన్నుల బరువు ఉన్నట్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు