యువతపైనా కరోనా తీవ్రత!

14 Jul, 2020 10:44 IST|Sakshi

వాషింగ్టన్: కరోనా వైరస్​తో యువతకు పెద్ద ప్రమాదమేమి ఉండదనే వాదననను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కొట్టిపారేసింది. ప్రతి ముగ్గురు అమెరికన్​ యువకుల్లో ఒకరు కరోనా వల్ల తీవ్రంగా ప్రభావం చెందే అవకాశం ఉందని చెప్పింది. యూనివర్సిటీకి చెందిన బెనీఫ్ పిల్లల ఆసుపత్రిలో 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న వారి శాంపిళ్లను పరిశీలించిన మీదట  ఈ కామెంట్లు చేసింది. (త్వరలో శుభవార్త అందించబోతున్నాం: ట్రంప్‌)

ఇందుకు సంబంధించిన పూర్తి ఫలితాలను సోమవారం విడుదలైన అడాలసెంట్ హెల్త్ జర్నల్​లో వెల్లడించింది. గుండె జబ్బులు, డయాబెటిస్​, లివర్​ సంబంధిత వ్యాధులు, ఒబెసిటీ, పొగతాగడం, వ్యాధి నిరోధక శక్తి తదితరాలను పరిశీలనలోకి తీసుకుని అమెరికా వ్యాప్తంగా సేకరించిన 8,400 శాంపిళ్లలో 33 శాతం మంది మగాళ్లు, 30 శాతం మంది ఆడాళ్లు కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితమవుతారని తేలిందని వివరించింది. మిగతా వాటితో పోల్చితే పొగతాగేవారు మరింతగా కరోనా వల్ల ఇబ్బందిపడతారని  హెచ్చరించింది. (కుప్పకూలిన మరో జెట్‌ ఫ్లైట్‌)

మరిన్ని వార్తలు