అన్ని ఫ్లూ వ్యాధులకూ ఒకటే టీకా

7 Oct, 2013 02:17 IST|Sakshi
అన్ని ఫ్లూ వ్యాధులకూ ఒకటే టీకా

 లండన్: అన్ని రకాల ఫ్లూ వ్యాధులనూ నిరోధించే సార్వత్రిక టీకా తయారీకి మార్గం సుగమం అయింది. భారత శాస్త్రవేత్త అజిత్ లాల్వాణీ నేతృత్వంలోని బృందం ఈ దిశగా కీలక ముందడుగు వేసింది. ఫ్లూ వ్యాధిని కలిగించే ఇన్‌ఫ్లుయెంజా వైరస్ ఏటా రూపం మార్చుకుంటూ ఉండటంతో ఏటా కొత్త కొత్త టీకాలను తయారుచేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తాము ఈ వైరస్‌లోని ఓ కీలక భాగా న్ని గుర్తించామని, దీంతో వైరస్‌పై తెల్లరక్త కణాలు దాడిచేసేలా చేయగల టీకాను తయారుచేస్తే.. వైర స్ రూపం మార్చుకున్నా హతమార్చవచ్చని అజి త్ చెప్పారు. అందుబాటులో ఉన్న ఎంఎంఆర్ టీకా వంటివాటితో పోల్చితే తాము తయారుచేస్తున్న టీకా పూర్తి భిన్నంగా ఉంటుం దని, రూపం మార్చుకున్నా.. వైరస్‌కు వ్యతిరేకంగా ప్రతిదేహాలను విడుదల చేసేలా రోగనిరోధక వ్యవస్థను ఇది ప్రేరేపిస్తుందన్నారు. పరిశోధన వివరాలు ‘నేచర్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురిత మయ్యాయి.

మరిన్ని వార్తలు