ఆన్‌లైన్ తల్లిపాలతో ముప్పు

20 Jun, 2015 10:29 IST|Sakshi
ఆన్‌లైన్ తల్లిపాలతో ముప్పు

లండన్: ఆన్‌లైన్‌లో దొరికే తల్లిపాలతో ఆరోగ్యానికి ముప్పువాటిల్లుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బలవర్ధకంగా పేర్కొంటూ ఆన్‌లైన్‌లో అమ్మేపాలను తాగితే కేన్సర్, హెపటైటీస్, సిఫిలిస్, హెచ్‌ఐవీ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందని లండన్‌లోని క్వీన్ మేరి విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. నిర్దేశిత ప్రమాణాల మేరకు కాగని తల్లిపాలను తాగడం వల్ల అంటు వ్యాధులు వచ్చే ముప్పు ఎక్కువని వారు హెచ్చరించారు. ఈ పాలతో ఐస్‌క్రీములు, ఇతర పాలఉత్పత్తులు తయారుచేసి అమ్మటం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఈ పాలను తాగితే కండరాలు, రోగనిరోధక శక్తి పెరుగుతుందని వెబ్‌సైట్లు ప్రచారం చేస్తున్నాయనీ,  కానీ వాటికి ఎలాంటి శాస్త్రీయఆధారాలు లేవని శాస్త్రవేత్తలు తేల్చారు.

మరిన్ని వార్తలు