2.5 లక్షల మంది స్వదేశానికి తిరిగొచ్చేశారు

19 Mar, 2016 12:34 IST|Sakshi
2.5 లక్షల మంది స్వదేశానికి తిరిగొచ్చేశారు

ఇస్లామాబాద్ : ప్రస్తుత ప్రభుత్వ హయాంలో విదేశాల నుంచి మొత్తం 251,624 పాకిస్తానీ జాతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారని ఆదేశ మీడియా సంస్థ శనివారం వెల్లడించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పాక్ తిరిగి వచ్చిన వారి వివరాలను ఆ దేశ హోం శాఖ మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ గణాంకాలతో సహా వివరించారని తెలిపింది. 2013లో జున్ 1 - డిసెంబర్ 31 మధ్య 45,008 మంది పాకిస్థానీయులు స్వదేశం చేరుకున్నారని వివరించారు.

అలాగే 2014లో 78, 409 మంది... 2015లో 116,165 మంది... గత కొన్ని నెలలుగా 12,022 మంది స్వదేశం పాక్ చేరుకున్నారని విశదీకరించారు. అధికారిక నివేదిక ప్రకారం గత రెండున్నర ఏళ్లుగా.... సౌదీ అరేబియా నుంచి 120,393 మంది, ఇరాన్ నుంచి 38,097 మంది, యూఏఈ నుంచి 23, 330 మంది, బ్రిటన్ నుంచి 5400 మంది, యూఎస్ నుంచి 358 మంది, ఒమెన్ నుంచి 11,248 మంది, మలేషియా నుంచి 9, 789, గ్రీస్ నుంచి 6,976 నుంచి పాక్ చేరుకున్నారని పేర్కొంది. భారత్ నుంచి మాత్రం 27 మంది పాక్ చేరుకున్నారని చెప్పింది.

>
మరిన్ని వార్తలు