400 మంది ఉగ్రవాదుల లొంగుబాటు!

22 Apr, 2017 09:28 IST|Sakshi
400 మంది ఉగ్రవాదుల లొంగుబాటు!

ఇస్లామాబాద్‌: సుమారు 400 మంది ఉగ్రవాదులు తమ ఆయుధాలను వదిలేసి జనజీవనస్రవంతిలో కలిసిపోయారు. పాక్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌ రాజధాని నగరం క్వెట్టాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

ఉగ్రవాదులు ఆయుధాలను వదిలేసి లొంగిపోయిన నేపథ్యంలో బలూచిస్తాన్‌ అసెంబ్లీలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. బలూచిస్తాన్‌ ముఖ్యమంత్రి నవాబ్‌ సనావుల్లా జెహ్రీ, సినియర్‌ ఆర్మీ అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెహ్రీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులను జనజీవన స్రవంతిలో కలపడానికి అవసరమైన అన్నిచర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అమాయక ప్రజలను చంపడానికి ఉగ్రవాదులు బలూచ్‌ ప్రావిన్స్‌లోని అమాయక ప్రజలను ఉపయోగించుకుంటున్నారని ఆయన అన్నారు. లొంగిపోయిన ఉగ్రవాదుల్లో బలూచ్‌ రిపబ్లికన్‌ ఆర్మీ, బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీతో పాటు పలు సంస్థలకు చెందిన వారు ఉన్నారని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.

మరిన్ని వార్తలు