80 శాతానికి పైగా టికెట్లు అమ్మేశారు

31 Jul, 2016 09:53 IST|Sakshi
80 శాతానికి పైగా టికెట్లు అమ్మేశారు

రియో డీ జనీరో: జికా వైరస్ సృష్టించిన కలకలం, అనవసరపు ఖర్చు అంటూ స్వదేశంలో తీవ్ర ఆందోళనలు రియో ఒలంపిక్స్పై పెద్దగా ప్రభావం చూపలేదు. విశ్వక్రీడా సంబరానికి జనాదరణ ఏమాత్రం తగ్గలేదు. ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానున్న రియో ఒలంపిక్స్ కోసం.. అందుబాటులో ఉంచిన 80 శాతానికి పైగా టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయని నిర్వాహకులు శనివారం వెల్లడించారు. టికెట్ల కోసం అభిమానులు 320 మిలియన్ డాలర్లను చెల్లించినట్లు వారు తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యంలో ఇది 96 శాతం అని రియో 2016 ఒలంపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.

ఒలంపిక్స్ నిర్వహణకయ్యే మొత్తం వ్యయంలో.. 16 శాతం ఆదాయం టికెట్ల అమ్మకాల ద్వారా వస్తుందని ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది. ఒలంపిక్స్‌ సన్నాహకాలు అంతా సవ్యంగా సాగుతున్నాయని రియో 2016 ప్రెసిడెంట్ కార్లోస్ నుజ్మన్ తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు