థాయ్‌లాండ్‌ బీచ్ను మూసేస్తున్నారు

17 May, 2016 19:53 IST|Sakshi
థాయ్‌లాండ్‌ బీచ్ను మూసేస్తున్నారు

బ్యాంకాక్: ఒకప్పుడు రద్దీగా ఉండే థాయిలాండ్కు చెందిన బీచ్ ఒకటి శాశ్వతంగా మూతపడనుంది. వాతావరణాన్ని సంరక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో థాయిలాండ్, ఇతర దేశాల నుంచే వచ్చే పర్యాటకులకు ఈ బీచ్ దూరం కానుంది. అండమాన్ సముద్రంలోని సిమిలాన్ నేషనల్ పార్క్ సమీపంలో కోహ్ తచాయి అనే చిన్న ద్వీపం ఉంది. ఇక్కడ అందమైన బీచ్ ఒకటి నెలవై ఉంది. ఇక్కడి పెద్ద మొత్తంలో పర్యాటకు స్వదేశీయులు వస్తుంటారు.

అయితే, దీనిని ఇక పూర్తిస్థాయిలో ఈ ఏడాది అక్టోబర్ మాసం నుంచి మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు ది బ్యాంకాక్ పోస్ట్ వెల్లడించింది. 'ఇన్ని రోజులపాటు మనందరకి ఆహ్లాదాన్ని ఇచ్చిన కోహ్ తచాయికి ధన్యవాదాలు చెబుతున్నాను. కుప్పలుకుప్పలుగా వచ్చిన టూరిస్టులతో కొద్దికాలంలోనే ఎంతో పాపులర్ అయింది. కానీ, మితిమీరిన జనాలు రావడం వల్ల సమీపంలోనే జాతీయ పార్క్ వాతావరణంపై దుష్ప్రభావం పడే పరిస్థితి తలెత్తింది' అని ఆ పార్క్ అధికారి ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు