కోతులపై టీకా పరీక్ష.. సానుకూలం

16 May, 2020 03:24 IST|Sakshi

లండన్‌: కరోనా వైరస్‌పై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధనలో ఆశాజనకమైన ఫలితాలు కనిపించాయి. ఈ పరిశోధనలో భాగంగా  ChAdOx1 nCoV-19 అనే వ్యాక్సిన్‌ను ఆరు కరోనా బాధిత కోతులకు ఇచ్చారు. దీంతో ఆ కోతుల్లోని రోగ నిరోధక శక్తి కరోనాను అడ్డుకున్నట్లు గుర్తించారు. వ్యాక్సిన్‌ ఇచ్చిన కోతుల్లో దుష్ప్రభావాలు ఏవీ కనిపించలేదు. కరోనా వల్ల ప్రధానంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కానీ, ఈ వ్యాక్సిన్‌ డోసు ఇచ్చిన కరోనా బాధిత కోతుల్లో ఊపిరితిత్తులకు ఎలాంటి హానీ జరగలేదు. ఇతర అవయవాలపైనా వైరస్‌ తీవ్రతను వ్యాక్సిన్‌ తగ్గించింది. కోతుల్లో జరిగిన పరిశోధన సానుకూల ఫలితాన్ని ఇవ్వడంతో పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తయారీకి ఊతం లభించినట్లేనని నిపుణులు చెబుతున్నారు.  ఈ వ్యాక్సిన్‌ మనుషుల్లో కూడా కరోనాను నిర్మూలిస్తుందని తేలితే ఈ ఏడాది చివరి కల్లా 10 మిలియన్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఔషధ తయారీ సంస్థ అస్ట్రాజెనికా వెల్లడించింది.   

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు