కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్‌ ‘జిన్‌’ పోరు

5 Nov, 2018 05:10 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌లోని ప్రముఖ యూనివర్సిటీలు కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్‌లు తమ సంప్రదాయ వైరాన్ని మర్చిపోలేదు. తాజాగా కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ తన సొంత బ్రాండ్‌ జిన్‌ క్యూరేటర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆక్స్‌ఫర్డ్‌తో మరో పోటీకి తెరతీసింది. గత ఏడాది ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ తన సొంత ఫిజిక్‌ బ్రాండ్‌ జిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వర్సిటీ గార్డెన్‌లోని చెట్లు, మొక్కల నుంచి రూపొందించిన ఈ జిన్‌ ధర 35 పౌండ్లుగా నిర్ణయించింది.

అయితే, ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఇసాక్‌ న్యూటన్‌ సాపేక్ష సిద్ధాంతం కనుగొనేందుకు కారణమైన యాపిల్స్‌ నుంచి తాము క్యూరేటర్‌ జిన్‌ తయారు చేస్తున్నట్లు కేంబ్రిడ్జ్‌ తెలిపింది. దీనిని తమ బొటానికల్‌ గార్డెన్స్‌లోని యాపిల్స్‌ నుంచి రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ జిన్‌ ధర 40 పౌండ్లుగా తెలిపింది. ఇప్పటికే యూనివర్సిటీలోని దాదాపు 12 కళాశాలలకు ఈ జిన్‌ను అందజేస్తున్నట్లు తెలిపింది. తాజాగా, ఇదే కోవలోకి లీసెస్టర్‌ యూనివర్సిటీ కూడా వచ్చి చేరింది. తమ వర్సిటీ బొటానిక్‌ గార్డెన్‌లోని మొక్కల నుంచి జిన్‌ తయారు చేసేందుకు ఇటీవలే తమ విద్యార్థులకు అనుమతినిచ్చింది.

మరిన్ని వార్తలు